సూసైడ్‌నోట్ కలకలం

25 Sep, 2014 03:41 IST|Sakshi
సూసైడ్‌నోట్ కలకలం

వాడపల్లి వంతెనపై పోలీసులకు లేఖ, బైక్, ఫోన్ లభ్యం
కృష్ణానదిలో గాలింపు చర్యలు
 మిస్సింగ్ కేసు నమోదు

 
వాడపల్లి(దామరచర్ల)
మండల పరిధిలోని వాడపల్లి వంతెనపై లభించిన ఓ సూసైడ్‌నోట్ తీవ్ర కలకలం రేపింది. వివరాలు..వాడపల్లి ఎస్సై వీరరాఘవులు బుధవారం ఉందయం పెట్రోలింగ్‌లో భా గంగా వంతెనపైకి వెళ్లగా బైక్, సూసైడ్‌నోట్ రాసిన కాపీ, స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ లభించాయి. లేఖలోని వివ రాలు ఇలా ఉన్నాయి.. ‘‘నాపేరు ధీరావత్ సుధాకర్, మాది దామరచర్ల మం డలం వీర్లపాలెం గ్రామం. అండ్రోమిడా సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో మిర్యాలగూడ ఏరియాకు డీలర్‌గా పనిచేస్తున్నా. కంపెనీలో పనిచేస్తున్న నల్లగొండకు చెందిన వెంకట్‌రెడ్డి, విశాఖపట్టణానికి  చెంది న రంఘనాథ్‌లు నాకు రూ.90 వేలు ఇవ్వాలి.

వారిని సంప్రదిస్తే సాకులు చెబుతున్నారే తప్ప డబ్బులు ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో న దిలో దూకుతున్నా.. నా ఆత్మహత్యకు కారణం వారిద్దరే’’ అని రాసి ఉంది. దీంతో ఎస్‌ఐ వెంట నే ఘటన స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా సుధాకర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడి గురించి ఆరా తీశాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి  తిరిగి రాలేదని అతడి భార్య అర్పిత పోలీసులకు తెలిపింది. కాగా,సుధాకర్ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుధాకర్ భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.    
 

మరిన్ని వార్తలు