జోగుళాంబ ఆలయం ముస్తాబు

25 Sep, 2014 03:42 IST|Sakshi
జోగుళాంబ ఆలయం ముస్తాబు

నేటినుంచి దక్షిణకాశీలో శరన్నవరాత్రి ఉత్సవాలు
 

 అలంపూర్: తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతుండటంతో అలంపూర్ ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. జోగుళాంబ ఆలయంలో పదిరోజుల పాటు జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నరహరి గురురాజ పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్‌వరణం, మహాకలశ స్థాపన, సాయంత్రం అంకురారోపణము, ధ్వజారోహణం పూజలు నిర్వహించనున్నారు. నవావరణ అర్చనలు, చండీహోమాలు వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. గురువారం రాత్రి అమ్మవారు శైలపుత్రి దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుమారి, సువాసిని పూజలు, మహా మంగళహారతి, మంత్రపుష్ప పూజలు  చేస్తారు.

festivals, alampur

 

మరిన్ని వార్తలు