చిరుతకు పోస్టుమార్టం

14 Feb, 2018 16:06 IST|Sakshi
పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్యులు

నిజామాబాద్‌ అగ్రికల్చర్‌(నిజామాబాద్‌ అర్బన్‌) : నవీపేట్‌ మండలంలోని అబ్బాపూర్‌(ఎం) గ్రామీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిరుత పులికి జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదంలో పులి పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు రంధ్రం పడి తీవ్ర రక్తస్రావం జరగడంతో మృతిచెందినట్లు వైద్యులు రాకేశ్, ఖాజా కైసర్, అంకిత తెలిపారు. చిరుతపులి వయసు సుమారు 5 నుంచి 6 ఏళ్లు ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం కళేబరాన్ని అటవీ రేంజ్‌ అధికారి రవి మోహన్‌ భట్, ఎఫ్‌డీఓ వేణుబాబుకు అప్పగించారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్లారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు దహనం చేశారు.
 

మరిన్ని వార్తలు