అర్ధరాత్రి హైడ్రామా..!

16 Sep, 2014 01:43 IST|Sakshi
అర్ధరాత్రి హైడ్రామా..!

వనపర్తి టౌన్: వనపర్తిని జిల్లాగా ఏర్పా టు చేయూలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో అర్థరాత్రి హైడ్రామా  చోటుచేసుకుంది. తన దీక్షను భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించేందుకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు ప్రయత్నాలు చేపట్టడంతో వారి రాకను ముందే పసిగట్టిన ఆయన హటాత్తుగా ఇంట్లోకి వెళ్లి గేటుకు తాళం వేసుకుని అక్కడే దీక్ష ను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మార్గమధ్యమంలో జరి గిన తోపులాటలో చిన్నారెడ్డి కింద పడిపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దింపారు.
 
అరుుతే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు చిన్నారెడ్డి ఇంటి ఎదుటే డీఎస్పీ చెన్నయ్య, సీఐ మధుసూదన్‌రెడ్డిలను అడ్డుకున్నారు. తామె ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చామని చెప్పడం తో ఆయన లోపలినుంచే వారితో మాట్లాడారు. తాను దీక్ష చేపట్టి రెండు రోజులు కూడా కాలేదని, తన  ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. మీ ఆరోగ్యం క్షీణిం చిందని డాక్టర్లు చెప్పినందునే తాము వ చ్చినట్లు డీఎస్పీ చెప్పినా ఆయన విని పించుకోకుండా దీక్షను కొనసాగించారు. పోలీసులు మొండిగా వ్యవహరిస్తే ఆత్మార్పన చేసుకుంటామని కార్యకర్తలు హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఆయ న దీక్ష స్థలికి వచ్చి దీక్షలో కూర్చున్నారు.
 
హామీ ఇచ్చారు..అమలు చేయూల్సిందే...!

వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మెుదటివిడతలో నే వనపర్తి జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే జిల్లాను ఏర్పాటు చేయూలని జి.చిన్నారెడ్డి అన్నారు.  చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష  సోమవారం మూడో రోజు కొనసాగింది. ఆయన మాట్లాడుతూ తన దీక్షను భగ్నం చేసేందుకు ఆదివారం రాత్రి అధికారులు విఫలయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. వనపర్తికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని, భౌగోళికంగానూ జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
 
నిలకడగా చిన్నారెడ్డి ఆరోగ్యం...
చిన్నారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. సాయంత్రం ఆయనకు బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించగా, బీపీ 138 నమోదు కాగా, షుగర్ 102గా నమోదైంది.

మరిన్ని వార్తలు