ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే మేలు

19 Dec, 2019 01:45 IST|Sakshi

కేపీహెచ్‌బీకాలనీ: ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే యువతకు మేలు చేకూరుతుందని, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారించా లని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. బుధవారం జేఎన్టీయూహెచ్‌ ఆడిటోరియంలో ఎన్‌ఎస్‌ఎస్, కూకట్‌పల్లి ఇస్కాన్‌ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ‘కిల్‌ కేన్సర్‌’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేన్సర్‌ పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వా లు చర్యలు తీసుకోవాలన్నారు. యంగ్‌ తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే యంగ్‌ గవర్నర్‌గా తాను నియమితులు కావడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్‌ వీసీ, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదిత రులు పాల్గొన్నారు. కాగా, ఏసు ప్రభువు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని, ఆయన బోధనలు ఆచరణీయమని గవర్నర్‌ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు