కేసీఆర్‌కు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డు

6 Sep, 2017 02:26 IST|Sakshi
కేసీఆర్‌కు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డు

► సీఎం తరఫున ఢిల్లీలో అవార్డు అందుకున్న పోచారం
► రైతును రాజును చేయాలన్నదే కేసీఆర్‌ సంకల్పమన్న మంత్రి


సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు జాతీయస్థాయిలో లభించిన ‘గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌– 2017’ అవార్డును ఆయన తరఫున మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఐసీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో 10వ గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ సదస్సు ఘనంగా జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా పాలసీ లీడర్‌షిప్‌ విభాగంలో కేసీఆర్‌కు దక్కిన అవార్డును హరియాణా గవర్నర్‌ కేఎస్‌ సోలంకి, ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ల చేతుల మీదుగా అందుకున్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమా నికి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలు, సంస్కరణలను గుర్తించిన ఐసీఎఫ్‌ఏ 2017కు గాను ఈ అవార్డును బహూకరించింది.
 
రైతులకు బాసటనిచ్చేలాపథకాలు: పోచారం
రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్‌ సంకల్పమని.. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసిందని మంత్రి పోచారం పేర్కొన్నారు. కేసీఆర్‌ తరఫున అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో వచ్చే సంవత్సరం నుంచి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రైతులకు బాసటగా నిలిచేలా ప్రవేశపెడుతున్న పథకా లే కేసీఆర్‌ను గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డు గ్రహీతగా నిలిపాయని పేర్కొన్నారు. 36 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు.

రైతును రాజుగా నిలపాల న్నది కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరిగే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో రైతులకు పారదర్శకంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందనున్నట్లు చెప్పారు. రైతు సమన్వయ సమితులు ప్రతి గ్రామంలో భూ పరిశీలన జరిపి.. ఏ పంట వేయాలో రైతులకు సూచిస్తాయని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ రమేశ్‌ చాంద్, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్‌ వి.జగదీశ్వర్‌రావు, ఐసీఎఫ్‌ఏ చైర్మన్‌ ఎంజే ఖాన్‌లతో పాటు పలువురు వ్యవసాయరంగ నిపుణులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు