బతుకమ్మ ఉత్సవాలు

28 Sep, 2019 11:32 IST|Sakshi
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ఓ పాఠశాల విద్యార్థినుల నవదుర్గల వేషధారణ

సాక్షి, ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు  అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 6 వరకు కొనసాగుతాయని, జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ సంస్థలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్‌ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో, 4న మున్సిపాల్టీల్లో, 6న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో మోడల్‌ బతుకమ్మలను ప్రదర్శించాలని సూచించారు. బతుకమ్మల నిమజ్జనానికి చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది బతుకమ్మ పాట ల పోటీలు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో అంజయ్య, ఆర్‌డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, జిల్లా సమాచారశాఖ డీడీ ముర్తూజా, రమేశ్‌ రాథోడ్, సుదర్శనం, గోవింద్, జయసుధ, స్రవంతి, శశికళ, సంధ్యారాణి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు