నేడే సహకార నోటిఫికేషన్‌

3 Feb, 2020 08:29 IST|Sakshi
గొల్లగూడ సహకార సంఘం

జిల్లాలో 42 పీఏసీఎస్‌లకు ఎన్నికలు

ఒక్కో సంఘంలో 13 డైరెక్టర్‌ స్థానాలు, 15న పోలింగ్, ఫలితాలు

సాక్షి, నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జిల్లాలోని ఆయా సంఘాల ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. జిల్లాలో మొత్తం 43 పీఏసీఎస్‌లు ఉండగా కట్టంగూరు మినహా 42 సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. కట్టంగూర్‌ సహకార సంఘం పాలకవర్గ పదవీకాలం పూర్తి కానందున ఆ సంఘానికి ఎన్నికలు నిర్వహించడంలేదు.

మొత్తం 42 సంఘాల్లో సుమారు  లక్షా 15 వేలకు పైగా సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 13 డైరెక్టర్‌ స్థానాలు ఉంటాయి. వీటిలో 2 డైరెక్టర్‌ స్థానాలు ఎస్సీ, 1 ఎస్టీ, 2 బీసీ, 8 స్థానాలు జనరల్‌ (అందులో 7 మేల్, 1 ఫిమేల్‌) రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. కాగా జిల్లాలోని 42 సహకార సంఘాల్లోని మొత్తం 546 డైరెక్టర్‌ స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఈనెల 6, 7, 8 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల ఉంటుంది.
పోటీ చేసేందుకు అర్హతలు..

ఆయా సంఘాల పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.
21సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
31 డిసెంబర్‌ 2018 నాటికి సభ్యుడై ఉండాలి.
31 డిసెంబర్‌ 2019 నాటికి సంఘంలో అప్పు ఓడీ అయ్యి ఉండకూడదు.సంఘంలో రూ.330 సభ్యత్వ రుసుం చెల్లించి ఉండాలి.

అన్ని ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ఎన్నికల సంఘం, కలెక్టర్‌ ఆదేశాల ప్రకా రం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ మెటీరియల్‌ను సిద్ధం చేశాం. 42 మంది ఎన్నికల అధికారులను నియమించాం. ఎన్నికలకు సుమారు రెండు వేల మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నాం. 
– రావిరాల శ్రీనివాసమూర్తి, జిల్లా అదనపు ఎన్నికల అధికారి   

మరిన్ని వార్తలు