30 మందికి పాజిటివ్‌.. నలుగురు మృతి

11 Jul, 2020 15:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి ఏ రంగాన్ని వదలి పెట్టడం లేదు. సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో 30 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవ్వగా, కరోనాతో పోరాడి నలుగురు మృత్యువాతపడ్డారు. ఆర్టీసీలో కరోనా వెంటాడుతుంటే యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్లు లేకపోవడంతో తమ బాధలను ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. (ఒక్కో ఆక్సిజన్‌ సిలిండర్‌ రూ.లక్ష!!)

సింగరేణి-రైల్వే తరహాలో తార్నాక హాస్పిటల్‌లో ప్రత్యేకంగా 100 పడకలను కరోనాకు కేటాయించాలని కార్మికులు విజ్ఙప్తి చేశారు. నిత్యం ప్రజల్లో తిరిగే కండక్టర్లు, డ్రైవర్లకు ప్రభుత్వం కనీస వసతులను కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆర్ఠీసీ బస్సులో పాజిటివ్‌ రోగులు తిరిగినట్లు నిర్ధారణ అయ్యిందని, ఆర్టీసీ కార్మికులకు సైతం 50 లక్షల లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. (చొక్కాలు చింపుకున్న డాక్టర్లు)

మరిన్ని వార్తలు