సింగపూర్‌లో చిక్కుకున్న మన విద్యార్థులు

20 Mar, 2020 16:24 IST|Sakshi
సింగపూర్‌లోని చంగీ ఎయిర్‌పోర్టు

సాక్షి, జడ్చర్ల: కరోనా వైరస్‌ కారణంగా సింగపూర్‌లోని చంగీ ఎయిర్‌పోర్టులో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన ఆరుగురు వైద్య విద్యార్థులు చిక్కుకుపోయారు. బుధవారం భారత్‌ వస్తుండగా చివరి నిమిషంలో అధికారులు వీరి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న వీరిని 72 గంటల్లోగా తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విద్యార్థులు ముందు సింగపూర్‌ చేరుకున్నారని, తర్వాత ఇక్కడికి రావడానికి విమానం ఎక్కే చివరి నిమిషంలో ప్రయాణం నిలిపివేయాలని భారత్‌ నుంచి అధికారులు అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు గురువా రం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ పిల్లలను రప్పించాలని కోరారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విద్యార్థులను క్షేమంగా జడ్చర్లకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. (ఎయిర్‌పోర్ట్‌ నుంచి అలా బయటకు వచ్చాం..)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు