వార్తల పద్ధతి మార్చా.. మండలిని మార్చుతా

20 Mar, 2015 00:24 IST|Sakshi

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
 
 నర్సంపేట: ‘ప్రజలకు ప్రపంచ సవూచారాన్ని అర్థవుయ్యే రీతిలో చదివే వార్తల పద్దతిని వూర్చా, పట్టభద్రులు అవకాశమిస్తే శాసనవుండలిలో ప్రతిపక్షనేతగా ప్రజా సవుస్యలపై పోరాడి వుండలినీ మార్చేస్తా’ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ వుల్లన్న పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని సర్వాపురంలో పట్టభద్రులతో ఆయన సమావేశమయ్యూరు. విద్యా వ్యాపారం చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించాలని, తనకే తొలి ప్రాధాన్యత ఓటు వేయూలని కోరారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయుకుల తొత్తులుగా పనిచేసినవారికి ప్రస్తుతం మం త్రిపదవులుఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు.  
 
కాంగ్రెస్ చరిత్ర మార్చిన వైఎస్సార్


నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేవు పథకాలనే నేడు కేసీఆర్ అవులు చేస్తున్నారని ఎమ్మెల్యే దొంతి వూధవరెడ్డి అన్నారు. ప్రవూణస్వీకారం రోజే మొదటి సంతకంతో రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా దివంగత వుుఖ్యవుంత్రి రాజ శేఖర్‌రెడ్డి కాంగ్రెస్ చరిత్రను వూర్చేశారన్నారు. ఎంపీపీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జక్క అశోక్, జెడ్పీటీసీలు ఎడ్ల జగన్మోహన్‌రెడ్డి, జున్నూతుల రాంరెడ్డి, అజ్మీర పద్మామేఘ్యానాయుక్, వుునిగాల వెంకట్‌రెడ్డి, గుగులోతు భరత్, పెండెం రావూనంద్, జ్ఞాన్‌సాగర్, పుల్లూరి స్వామి, నగర పంచాయుతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు