టీఆర్‌ఎస్‌ను ఆర్నెల్ల తర్వాత ఉరికించి కొడుతం | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను ఆర్నెల్ల తర్వాత ఉరికించి కొడుతం

Published Fri, Mar 20 2015 12:22 AM

erraballi fire on tdp  trs govt

టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు
 
తొర్రూరు: ఆర్నెల్ల తర్వాత టీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రాంతం నుంచి ఉరికించుకుంటా కొడుతామని టీడీపీ శాసనసభపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గస్థాయి సమావేశాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన గురువారం స్థానికంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దయూకర్‌రావు మాట్లాడారు. ప్ర జా సమస్యలను విస్మరిస్తూ.. వసూళ్ల దందాలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు బి జీ అయ్యూరని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీ, టీడీపీ కూటమి అ భ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును గెలిపించాలని కోరారు. విద్యావ్యాపారంతో అక్రమంగాకోట్లు కూడబెట్టినటీఆర్‌ఎస్ అభ్యర్థిరాజేశ్వర్‌రెడ్డినిఓడించాలన్నారు.

ప్రజా కోర్టులో నిలదీస్తాం..

హామీలు నెరవేర్చకుంటే టీఆర్‌ఎస్ సర్కారును ప్రజాకోర్టులో నిలదీస్తామని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు.  ప్రేమేందర్‌రెడ్డి, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ పరమేశ్వర్, పెదగాని సోమయ్య, మురళిమనోహర్, దుగ్యాల ప్రదీప్, జాటోతు నేహ్రునాయక్ పాల్గొన్నారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 22 జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నమని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహ/ంచాన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు సంబందించి ఇప్పటివరకు 675కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జాబితాలో ఫోటోలు లేని వారి వివరాలతో ప్రత్యేక జాబితా తయారు చేశామని వారు ఓటు వినియోగానికి వస్తే పూర్తి వివరాలు పరిశీలించిన త ర్వాతే ఓటుకు అనుమతిస్తారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తం పోలింగ్ ప్రాంతం 27రూట్లు,27జోన్లుగా విభజించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రాంతలో మద్యం విక్రయాలు బంద్ చేయాలని, 48గంటలముందునుంచి బల్క్ ఎస్‌ఎంఎస్‌లు నిషేదించాలని అన్నారు. ఏజేసీ తిరుపతిరావు,డీఆర్వో శోభ, ఆర్డీవోలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement