‘సైబర్ సెక్యూరిటీ’లో యువతకు అవకాశాలు

12 Dec, 2016 14:56 IST|Sakshi
‘సైబర్ సెక్యూరిటీ’లో యువతకు అవకాశాలు

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం: కేటీఆర్
హైదరాబాద్‌లో సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ ప్రారంభం
 

సాక్షి, హైదరాబాద్: డిజిటల్ టెక్నాలజీలతో ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా.. సైబర్ నేరాల రూపంలో ఎన్నో ఇబ్బందులూ తలెత్తుతున్నాయని మంత్రి కె.తారకరామా రావు అన్నారు. కంప్యూటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధా నమవుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరుగుతోందని.. దీనిని యువతకు ఉద్యోగాలు కల్పించగల అవకా శంగానూ పరిగణించవచ్చని చెప్పారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 2.0 సదస్సు ప్రారంభమైంది.

రెండు రోజుల ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. సైబర్ సెక్యూరిటీ మనకు ఎన్నో సవాళ్లు విసురుతోందన్నారు. అరుుతే దీన్ని యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించగల అవకాశంగానూ పరిగణించవచ్చు నన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ సెక్యూరిటీకి ప్రత్యేక విధానాన్ని రూపొందిం చిందన్నారు. అంతేగా కుండా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విసృ్తత స్థారుులో చర్యలు చేపడతామన్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులను అభివృద్ధి చేయడం కోసం కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంతో పాటు పలు ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

రాష్ట్రం లోని కీలక మౌలిక వసతులను సురక్షితంగా ఉంచేందుకు సుశిక్షుతులైన వారిని సిద్ధం చేస్తామన్నారు. ‘టీ-హబ్’ సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ విప్లవాత్మకమైన టెక్నాల జీ లు, అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుందన్నారు. ఐటీ కంపెనీలు, ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధానానికి ప్రయత్నా లు ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.

నిపుణుల అవసరమెంతో ఉంది...
రానున్న నాలుగేళ్లలో దేశంలో దాదాపు పది లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ తెలిపారు. మన దేశం ప్రభుత్వ రంగంలో వెరుు్య మంది నిపుణులను నియమిస్తుంటే.. చైనా 1.25 లక్షల మందిని నియమిం చుకుంటోందని చెప్పారు. హ్యాకింగ్‌తో పాటు అనేక ఇతర సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయను న్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి అది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇజ్రాయెల్‌తో కలిసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పా రు. కార్యక్రమంలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ సంస్థ కాన్‌ఫిడాస్ సీఈవో రామ్ లెవీ, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, ఎస్‌సీఎస్‌సీ చైర్మన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, కార్యదర్శి భరణీ అరోల్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు