అందరి చూపు మరియపురం వైపు..!

12 Sep, 2019 08:12 IST|Sakshi
మరియపురం గ్రామపంచాయతీ కార్యాలయం

గంగదేవిపల్లి తరహాలో ఆకర్శిస్తున్న గ్రామం

హరితహారానికి కేరాఫ్‌గా మారిన జీపీ

సాక్షి, గీసుకొండ(పరకాల): జిల్లాలోని గీసుకొండ మండలంలోని మరియపురం ఆదర్శంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అనతికాలంలోనే సర్పంచ్‌ బాలిరెడ్డి ప్రజల సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుని ఆదర్శాలకు నెలవుగా మారి గ్రామం మరింత పురోగమనం వైపు సాగుతోంది. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి తరహాలో మరియపురం సందర్శకులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తోంది.

ఈ గ్రామం హరితహారం కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచిందని చెప్పడం అతిశయోక్తి కాదు. పచ్చదనంతో హరితశోభను సంతరించుకుంది. గ్రామాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ఉద్యోగులు, ట్రెయినీ ఐఏఎస్‌లు సందర్శించారు. కలెక్టర్‌ హరితతో పాటు స్థానిక పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. డీపీవో, డీఆర్‌డీవో లాంటి అధికారులు ఎంతో మంది వచ్చిపోతున్నారు. 

30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో ముందంజ..
30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల అమలులో గ్రామం ముందుంది. చెత్తా చెదారం తొలగించడం, పాడుబడిన బావులను పూడ్చడం, శిథిలమైన ఇళ్లను తొలగించడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం చేశారు. మురుగు గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలను అరికట్టే చర్యలు చేపట్టారు. విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. సర్పంచ్‌ బాలిరెడ్డి వార్డు సభ్యులు, గ్రామస్తులు, పొదుపు సంఘాలతో కలిసి చేపడుతున్న పనులతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. 

నేడు గ్రామానికి మంత్రి దయాకర్‌రావు
మరియపురం గ్రామాన్ని గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 30 రోజుల ప్రణాళికలో భాగంగా సందర్శించడానికి వస్తున్నట్లు సర్పంచ్‌ బాలిరెడ్డి తెలిపారు. ఆయనతో కలెక్టర్‌ హరిత, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అధికారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పుస్తకాలు, టవల్స్‌ ఇవ్వండి..: మంత్రి

ఫేస్‌బుక్‌ బురిడీ

లైవ్‌ అప్‌డేట్స్‌: కదిలిన బాలాపూర్‌ గణేశుడు

‘గులాబీ’ ముఖ్య నేతలకు ఫోన్‌

కశ్మీర్‌ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర 

తీరనున్న యూరియా కష్టాలు

ఆర్థిక స్థితి కంటే ఆవు సంగతే ముఖ్యం: అసద్‌

చలానా.. కోట్లు..సాలీనా!

‘రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు’

‘ఎరువుల కొరత లేదు’

పోరాటాలకు సిద్ధం కావాలి

ఆర్థిక మాంద్యం పేరుతో కేసీఆర్‌ ఎత్తుగడ: భట్టి

దుష్పచారాన్ని తిప్పికొట్టాలి

మోసపోయి.. మోసం చేసి..

కనీసం.. పిల్లనివ్వడం లేదు

డ్రాపౌట్స్‌కు చెక్‌!

అంకితభావంతో పనిచేయాలి 

నిఘా నీడన నిమజ్జనం

పార్టీ బలోపేతమే లక్ష్యం

బడిపిల్లలకు ‘ఈ–మ్యాగజైన్‌’

మండలి చైర్మన్‌గా గుత్తా

కేసీఆరే మా నేత..

హీటెక్కిన ఆర్టీసీ.. సమ్మె రూటులో

ఇంట్లో ఫైట్‌.. బయట టైట్‌

కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ భేటీ

మున్సిపల్‌ ఎన్నికల విచారణ వాయిదా

ఈనాటి ముఖ్యాంశాలు

ఎలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు

రేపు జంట నగరాలకు సెలవు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో