రేషన్‌ డీలర్లతో చర్చలు జరపాలి

1 Jul, 2018 10:54 IST|Sakshi
రేషన్‌ డీలర్ల సమ్మె

కరీంనగర్‌ సిటీ : తెలంగాణ ప్రభుత్వం వెంటనే రేషన్‌ డీలర్లతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. శనివారం కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌లో గజ్వేల్‌లో డీలర్‌ వజీన్‌ఖాన్‌ ఆత్మహత్యాయత్నం చేసినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రేషన్‌ డీలర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమస్యలను విన్నవించుకుంటే స్పందించని ప్రభుత్వం సమ్మెను విచ్చిన్నం చేయడానికి అన్ని విధాలా బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. సమస్యలు పరిష్కరించకుండా డీడీలు కట్టాలని ఒత్తిడి చేయడం తగదన్నారు.

సస్పెన్షన్‌ నోటీసును చూసి గజ్వేల్‌కు చెందిన డీలర్‌ ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్‌డీలర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు కూర ధర్మరాజు, జిల్లా కార్యదర్శి సదానందం, రాష్ట్ర రేష న్‌ డీలర్ల మహిళా అధ్యక్షురాలు వసంత, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌కే హైదర్, జిల్లా కోశాధికారి గాలి గట్టయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి శరణ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్, రవీందర్, లక్ష్మణ్, నరేష్, రమేశ్, ప్రతాప్, భాస్కర్, రాజేశ్వర్‌రావు, నర్సయ్య, శ్రీనివాస్, చంద్రమౌళి, అశోక్, నర్సిం హారెడ్డి, శంకర్‌లింగం, రాము తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు