యువ రైతులకు దూరవిద్యలో శిక్షణ

4 Jan, 2015 05:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులను రైతులకు వివరించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ నడుం బిగించింది. దూర విద్య ద్వారా యువ రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ఈ కోర్సును ప్రారంభించనుంది. ‘తెలంగాణ యువ రైతు సాగుబడి’ పేరుతో ఈ దూరవిద్య సర్టిఫికేట్ కోర్సును అందిస్తారు. రైతుల్లో ఆర్థిక పరిపుష్టిని పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. యూనివర్సిటీతోపాటు ఇతర వ్యవసాయ అనుబంధ శాఖలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
 

మరిన్ని వార్తలు