వికటించిన కు.ని.

24 Nov, 2014 03:59 IST|Sakshi
వికటించిన కు.ని.

 ఎల్కతుర్తి : ‘నాభార్య రానన్నా పదిసార్లు ఫోన్ చేశారు. చిన్న ఆపరేషనే అని చెప్పారు. బలవంతంగా తీసుకెళ్లి ఆపరేషన్ చేరుుంచారు. ఇప్పుడు పెద్ద ప్రాణాలే పోయూరుు. నా పిల్లలకు ఎవరు దిక్కు’ అంటూ ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి లలిత భర్త లక్ష్మణ్ రోదించాడు. కు.ని. ఆపరేషన్ వికటించి ఆదివారం లలిత చనిపోగా బంధువులు హుజూరాబాద్‌లో ఆందోళన చేపట్టారు.

బాధిత కుటుంబం, గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి లలిత(28), లక్ష్మణ్ దంపతులకు అంజలి(5), కార్తీక్(ఒకటిన్నర ఏళ్లు) ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ ఆశ కార్యకర్త శారద కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది.

అందుకు లలిత ఒప్పుకోకపోరుునా ఆశ కార్యకర్త మాత్రం ఈ నెల 21న హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ కరీంనగర్ నుంచి వచ్చిన వైద్యులు కు.ని. ఆపరేషన్ చేశారు. లలిత ఇంటికి వచ్చి వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని ఆశ కార్యకర్తకు తెలుపగా ఆమె రాలేదు సరికదా ఏఎన్‌ఎం, వైద్యాధికారికి సమాచారం ఇవ్వలేదు. దీంతో లలిత పరిస్థితి విషమంగా మారింది.

ఆదివారం ఉదయం మూత్రవిసర్జన కోసం లేచే ప్రయత్నం చేయగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మర్గమధ్యలోనే మృతి చెందింది. ఈవిషయమై బాధితులు వైద్య సి బ్బంది, ఆశ కార్యకర్తపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.

ఇందులో ఏఎన్‌ఎం హుజూరాబాద్ వైద్య సిబ్బందికి ఫోన్ చేయగా తాము రూ.25 వేలు ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేసేందుకు మృతదేహంతో హుజూ రాబాద్‌కు తరలి వెళ్లారు. ఈ విషయమై స్థానిక మండల వైద్యాధికారి లతను వివరణ కోరేం దుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.

 మృతదేహంతో రాస్తారోకో
 హుజూరాబాద్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చెల్పూరి లలిత(28) మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆదివారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మృతదేహంతో రాస్తారోకో చేశారు. ఎల్కతుర్తి మండలం సూరారానికి చెందిన చెల్పూరి లలిత శుక్రవారం హుజూరాబాద్ సివిల్ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంది.

ఆపరేషన్ తర్వాత వాంతులు, విరోచనాలు అయ్యాయని, పరిస్థితి విషమించడంతో ఆదివారం హన్మకొండకు తరలిస్తుంటే మార్గమధ్యలో మృతిచెందిందని మృతురాలి భర్త లక్ష్మణ్ విలపించాడు. హుజూరాబాద్ రూరల్ సీఐ భీంశర్మ, ఎస్సైలు జగదీశ్, రాజేందర్ అక్కడికి వచ్చి ఆందోళన విరమింపజేశారు.

మరిన్ని వార్తలు