ఇలాంటి ఘటనలు జరగకూడదంటే..

10 Dec, 2019 16:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మద్యం కారణంగానే మనుషులు మృగాలుగా మారుతున్నారన్నారని అన్నారు. మద్యం తాగిన మత్తులో అనాగరికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో దిశ ఘటనతోపాటు మరో రెండు ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోడానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో బాధితులైన సమత, మానస కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మద్యం అమ్మకాలు నిషేధించాలని డిమాండ్‌ చేశారు. దీనికోసం గురు, శుక్రవారాల్లో రెండురోజుల దీక్ష చేపడతానన్నారు. ఈ దీక్షను విజయవంతం చేసేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు.

మరిన్ని వార్తలు