సన్యాసులను రాజకీయంలోకి లాగొద్దు

9 Mar, 2015 01:50 IST|Sakshi

బాన్సువాడ: సన్యాసులను రాజకీయాల్లోకి లాగొద్దని త్రిదండి మహోబలి రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం నిర్వహించిన వేంకటేశ్వర ఆలయ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. త్రిదండి చిన్నజీయర్ స్వామిపై కొందరు రాజకీయ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామిని తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టకు వెళ్లడాన్ని కొందరూ రాజకీయ నాయకులు వేరేలా ఆలోచిస్తున్నారని, సన్యాసులకు అందరూ సమానమేనని అన్నారు. నాయకులు నోటిని దుర్వినియోగం చేసుకోవద్దని, అసూయ, ద్వేషాలు మంచివి కావని సూచించారు. అంతకు ముందు ఆలయంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు.

మరిన్ని వార్తలు