రెండు కుటుంబాల మధ్యే పోరు

2 Feb, 2016 04:30 IST|Sakshi
రెండు కుటుంబాల మధ్యే పోరు

ఖేడ్ ఉప ఎన్నిక మరోమారు రెండు కుటుంబాల ఆధిపత్య పోరుకు తెర తీసింది.  ఈ ఉప ఎన్నికలో ముగ్గురి మధ్యే ప్రధాన పోరు జరుగుతోంది. 1952 నుంచి ఒక్క పర్యాయం మినహా ఎక్కువ పర్యాయాలు మూడు కుటుంబాలకు చెందిన నాయకులే ఇక్కడ ఎన్నికవుతూ వచ్చారు. కాగా ఈమారు మాత్రం రెండు కుటుంబాల మధ్య పోరు సాగుతుంది.

వీరిలో ప్రధానంగా ఇద్దరు అన్నదమ్ములు తలపడుతున్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికలో 8మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోరు కొనసాగుతుంది. టీఆర్‌ఎస్ తరఫున భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున సంజీవరెడ్డి, టీడీపీ తరఫున విజయపాల్‌రెడ్డి పోటీచేస్తున్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు. ఇప్పటివరకు నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో షెట్కార్, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి కుటుంబాలే ఎన్నికవుతూ వచ్చాయి. ఒక్కసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థి రాంచెందర్‌రావుదేశ్ పాండే గెలుపొందారు.

ఇప్పటి వరకు గెలపొందింది వీరే..
నియోజకవర్గం అనాదిగా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది. ఈ మారు కాంగ్రెస్ కోటను బద్దలుకొట్టేందుకు టీఆర్‌ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది.  ఇప్పటివరకు 14మార్లు ఎన్నికలు జరగగా 10మార్లు కాంగ్రెస్ , రెండు పర్యాయాలు స్వతంత్రులు,  రెండు పర్యాయాలు టీడీపీ గెలిచింది.

మరిన్ని వార్తలు