పాసుబుక్కు ఇవ్వడంలేదని టవరెక్కిన రైతు

13 Feb, 2019 08:12 IST|Sakshi
టవర్‌ఎక్కిన చొక్కయ్య

భూ సమస్య పరిష్కారం కోసం ఆందోళన 

పురుగుల మందు తాగేందుకు యత్నించిన భార్య 

అడ్డుకున్న పోలీసులు, ఎస్సై హామీతో ఆందోళన విరమణ 

గన్నేరువరం(మానకొండూర్‌): అధికారులు వెంట నే తమ  భూ సమస్యను పరిష్కరించాలని కోరు తూ మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెంది న జేరిపోతుల చొక్కాయ్య మంగళవారం సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామంలోని 276 సర్వేనంబర్‌లో ఎకరం భూమి తన తండ్రి మొండ య్య ద్వారా వారసత్వంగా వస్తుందని తెలిపాడు. దీనికి సంబంధించి పాసుబుక్కును అధికారులు ఇవ్వడంలేదని ఆరోపించాడు. దీంతో రైతుబంధు, రైతుబీమా వర్తించడం లేదని, సమస్య పరిష్కారం కోసం టవర్‌ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలిసి చొక్కాయ్య భార్య లత పిల్లలతో సెల్‌టవర్‌ వద్దకు చేరుకుంది.

తమ భూమి నుంచి వరదకాల్వ వెళ్తోందని, భూముల కోల్పోతున్న రైతుల జాబితాలో తమపేరు ఉందని తెలిపింది. ఈ ఏడాది పంటలను సైతం సాగుచేసినట్లు పేర్కొంది. పాసు బుక్కు ఇవ్వడంలో అధికారులు తిరకాసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. ఈ భూమిపై గ్రామానికి చెందిన ఒక రైతు కోర్టుకు వెళ్లాడంతో వివాదం కొనసాగుతోందని, కోర్టు పరిధిలో ఉన్నందున్న జోక్యం చేసుకోలేమని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారించడానికి కృషి చేస్తానని ఎస్సై వంశీకృష్ణ హామీ ఇవ్వడంతో చొక్కాయ్య సెల్‌ టవర్‌ దిగివచ్చాడు. తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

మరిన్ని వార్తలు