కూతురిపై లైంగికదాడికి ప్రయత్నించిన తండ్రి..

25 Nov, 2018 13:24 IST|Sakshi

అమీర్‌పేట: కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే లైంగిక దాడికి యత్నించాడోవ్యక్తి. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్కూల్‌ టీచర్‌ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి తెలిపిన మేరకు..అమీర్‌పేట లీలానగర్‌లో  సయ్యద్‌ (46) పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బీఎస్‌ మక్తాలో మొబైల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి ముగ్గురు కూతుళ్లు. 13 ఏళ్ల పెద్ద కూతురిపై పలుమార్లు లైంగిక దాడికియత్నించాడు. మూడు రోజుల క్రితం లైంగికంగా వేధించేందుకు యత్నించగా తప్పించుకుని పారిపోయింది. మరుసటి రోజు పాఠశాలలో బాలిక ఎవరితో మాట్లాడకుండా ఉండటంతో గమనించిన టీచర్‌ ఆరాతీసింది. దీంతో తండ్రి వికృత చేష్టలను తెలిపిది. వెంటనే బాలిక తల్లికి సమాచారం అందించడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు సయ్యద్‌ను రిమాండ్‌కు తరలించారు. సయ్యద్‌పై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో  రౌడీషీట్‌ కేసు నమోదై ఉందని ఎస్‌ఐ తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమించినవాడు కాదన్నాడని...

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఐదో విడత అంతేనా? 

ఈవీఎంలపై అవగాహన 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!