నేటి నుంచి వేసవి బడులు

28 Apr, 2015 04:20 IST|Sakshi

- మే 30 వరకు కొనసాగింపు
- జిల్లాలో 12 వేల మంది విద్యార్థుల ఎంపిక
- బోధనకు 233 మంది సీఆర్పీలు
- ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాశాఖ
కెరమెరి :
చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన ద్వారా కనీస సామార్థ్యాలను సాధించేందుకు నిర్వహించనున్న వేసవి బడులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లల్లో సీఆర్‌పీలు నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 12 వందల మంది సీ గ్రేడ్ విద్యార్థులను  ఎంపిక చేశారు. 52 మండలాల్లో 233 మంది సీఆర్పీలు, ఎంపిక చేసిన 233 పాఠశాలల్లో వేసవి బడులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన శిక్షణలు ఈ నెల 15నుంచి 20 వరకు కొనసాగగా, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి విద్యాశాఖాధికారులు ఈ నెల 21న టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరిన్ని వివరాలు తెలియజేశారు. ఇందులో కేవలం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దీన్ని విజయవంతం చేసేందుకు సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు.

ఆటలు, పాటలు, ఓరిగామి ద్వారా బోధన
పాఠశాల వాతావరణానికి పూర్తిగా భిన్నంగా వేసవి బడులు కొనసాగుతారుు. పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీపట్టి అలసిపోయిన విద్యార్థులుకు వినూత్న విధానం ద్వారా బోధించనున్నారు. ఆటలు, పాటలు, ఓరిగామి (కాగితపు బొమ్మల) ద్వారా పూర్తిగా ఆహ్లాదం, ఆనంద భరిత వాతావరణంలో వేసవి బుడులు కొనసాగుతారు.

వేసవి బడులు ఎందుకు?
జిల్లాలోని అన్ని మండలాల్లో గల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో పాఠశాలను ఎంచుకుని వేసవి బడులు నిర్వహించనున్నారు. 2, 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు తెలుగులో చదవడం, రాయడం రానివారు, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయని వారు, ఆంగ్లంలో మాట్లాడలేని, పదాలు గుర్తించలేని, తరగతి స్థాయి లేని విద్యార్థులలో తరగతి స్థాయి లేదా కనీస అభ్యసన స్థాయిలు సాధించడమే వేసవి బడుల ముఖ్య ఉద్దేశం.
- బీ, సీ గ్రేడ్ విద్యార్థుల్లో అవసరమైన సామార్థ్యాలు సాధించుట.
- రాబోయే విద్యాసంవత్సరంలో అభ్యసించే తరగతికి పిల్లల్ని తయారు చేయడం.
- అభ్యసనం పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించే తరగతికి బోధనాభ్యాసన ప్రక్రియల్లో పాలుపంచుకోవడం.
- రెగ్యులర్‌గా హాజరుకాని విద్యార్థులు అభ్యసన స్థాయి సాధించుట.
- విద్యా సంవత్సరంలో అభ్యసించిన అంశాలు పునర్భలనం కోసం..
- విద్యలో సమాజం భాగస్వామ్యం కోసం..
- కేంద్ర నిర్వాహణ ద్వారా ఆశించేవి..


తెలుగులో ధారాళంగా చదవడం, మాట్లాడడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు, ఆంగ్లంలో విని అర్థం చేసుకుని మాట్లాడడం, పదాలు చదవడం, రాయడం, సృజనాత్మక కృత్యాల నిర్వాహణ, కథలు, పాటలు పాడడం, అభినయ గేయాలు, బొమ్మలు గీయడం, ఓరిగామి కళను అభ్యసించడం, సరదాసైన్స్ కృత్యాలు చేయడం లాంటివాటితో విద్యార్థుల్లో ఆద్యాంతం జోష్ నింపే తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు వేసవి బడులు కొనసాగనున్నాయి.

మూడు పరీక్షలు
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా విద్యార్థులను పరీ క్షించేందుకు ఆరంభ, మధ్యమ, అంత్య పరీక్షలు నిర్వహిస్తారు. నేడు ఆరంభం పరీక్ష నిర్వహించి ఆ పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకుని తరగతుల బోధన కొనసాగిస్తారు. పక్షం రోజుల తర్వాత మద్య మ, మే 30న అంతిమ పరీక్ష నిర్వహించి ప్రగతి నమో దు పత్రాన్ని తల్లిదండ్రులకు అందజేయనున్నారు.

>
మరిన్ని వార్తలు