విద్యార్ధులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బంపరాఫర్‌!

19 Dec, 2023 21:13 IST|Sakshi

విద్యార్ధులకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శుభవార్త చెప్పింది. బీఆర్‌ఓ పేరిట విద్యార్థుల కోసం కొత్త సేవింగ్స్‌ జీరో బ్యాంక్‌ అకౌంట్‌ని తీసుకొచ్చింది. ఈ ఖాతాను 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులు తెరవొచ్చు. ట్రాన్సాక్షన్‌లు చేసుకోవచ్చు.   

విద్యార్ధుల అర్హతను బట్టి జీవిత కాలం ఉచితంగా రూపే ప్లాటినమ్‌ డెబిట్‌ కార్డును అందిస్తారు. త్రైమాసికానికి రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ సదుపాయం ఉంటుంది.
 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సేవింగ్‌ అకౌంట్‌పై ఇతర ప్రయోజనాలు   

👉16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయస్సు గల వారికి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా

👉ప్రముఖ బ్రాండ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లతో జీవితకాల ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్

👉 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ 
 
👉యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ రూ.2 లక్షలు

👉ఆటో స్వీప్ సౌకర్యం అందుబాటులో ఉంది

👉డిజిటల్ ఛానెల్‌లు, బ్రాంచ్ ద్వారా ఉచిత ఎన్‌ఎఫ్‌టీ,ఆర్‌టీజీఎస్‌,ఐఎంపీఎస్‌,యూపీఐ సర్వీసులు  

👉అపరిమిత ఉచిత చెక్ లీవ్‌లు

👉ఉచిత ఎస్‌ఎంఎస్‌, మెయిల్స్‌ అలెర్ట్‌ 

👉డీమ్యాట్ ఏఎంసీలో 100శాతం వరకు రాయితీ

👉సున్నా ప్రాసెసింగ్ రుసుముతో విద్యా రుణాలపై రాయితీ వడ్డీ రేట్లు 

👉అర్హతకు లోబడి ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు

>
మరిన్ని వార్తలు