ఆ ఒక్కరే దిక్కు 

13 Feb, 2019 07:41 IST|Sakshi

వనపర్తి: రోజురోజుకు తగ్గిపోతున్న వనాలు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. ఫారెస్టు చట్టాలను మరింత కఠినతరం చేయడమే కాకుండా అటవీప్రాంతాన్ని కాపాడటంతో పాటు పచ్చదనం పెంచేందుకు ఊరుకో నర్సరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 139 గ్రామాల్లో డ్వామా, ఫారెస్టు శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు పెంచుతున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి మొక్కలు నాటే దశకు వస్తాయి.

కానీ అటవీ ప్రాంతా న్ని రక్షించే వనమాలి(బీట్‌ ఆఫీసర్‌) మాత్రం జిల్లాలో ఒక్కరే ఉన్నారు. ఫారెస్ట్‌ శాఖ లో ఉద్యోగుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. జిల్లాలో 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ పచ్చని ప్రాంతంలో వివిధ రకాల చెట్లు, మొక్కలు, అడవి జంతువులు, నెమళ్లు, జింకలు, కుందేళ్లతో పాటు ఇతర జంతువులు ఉన్నాయి. అడవిలో ఉండే చెట్లు, మొక్కలతో పాటు వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు mahaమొత్తం అటవీ ప్రాంతాన్ని 26 బీట్లుగా విభజించారు. ఒక్కో బీటుకు ఒక్కో అధికారి  సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఒక్కో బీట్‌ అధికారికి సుమారుగా 500 నుంచి 700 హెక్టార్ల భూభాగాన్ని కేటాయించారు. వారికి కేటాయించిన ప్రాంతంలోని చెట్లు, వన్యప్రాణులను నిరంతరం రక్షిస్తూ ఉండాలి.
 
ఆ ఒక్కరే దిక్కు 
జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు 26 వనమాలీలు (బీట్‌ అధికారులు) ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. సెక్షన్‌ అధికారులకు విధులను కేటాయించి వనసంరక్షణ చర్యలు చేపడుతున్నారు.  చట్టాలను కఠినతరం చేస్తూ వనాలు, వన్యప్రాణుల రక్షణపై అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడటం, చెట్లు తక్కువగా ఉన్న ప్రాంతంతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటించి పెంచడం, ఆయా బీట్ల పరిధిలో వన్యప్రాణులను రక్షించడం వనమాలి విధులు.

‘వనాల’పర్త
జిల్లావ్యాప్తంగా 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా వనపర్తి మండలం, ఖిల్లాఘనపురం మండలం, గోపాల్‌పేట మండలం బుద్దారం, పాన్‌గల్‌ మండలం, పెద్దమందడి మండలాల్లోని ప్రాంతాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉంది. వనపర్తి సంస్థానాధీశులు ఫారెస్ట్‌ కోసం ఇచ్చిన భూభాగమే ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం వనపర్తి మండలం శ్రీనివాసపురం, సవాయిగూడెం, చందాపూర్, దత్తాయపల్లి తదితర ప్రాంతాలను కలుపుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, కేంద్ర రక్షణ బలగాలు ఇక్కడ కొన్నాళ్లూ క్యాంపులు వేసి ఈ భూమిని ఫారెస్టుశాఖకు వర్తింపజేసేలా నీలగిరి చెట్లు, ఇతర రకాల మొక్కలను నాటించి వెళ్లారు. నాటినుంచి భూమి ఫారెస్ట్‌శాఖ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.!

నియామకాల ఊసేది? 
ఫారెస్టు శాఖలో సెక్షన్, బీట్‌ అధికారుల నియామకం కోసం ఏడాదిన్నర క్రితం ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఉద్యోగులను ఎంపిక చేశారు. కారణాలు ఏవైనా వారికి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. కొత్త చట్టాలను పకడ్బందీగా అమలుకు ఉద్యోగులను నియమించాల్సి ఉందని జిల్లా అధికారులు 
పేర్కొంటున్నారు.
 
 అడవి రక్షణకు చర్యలు 
ప్ర
స్తుతం అమల్లో ఉన్న 1967 ఫారెస్టు చట్టంలో మార్పులు చేస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ఫారెస్టుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వనాలు, వన్యప్రాణులు, పచ్చదనం పెంచడం తదితర అశాలపై సుదీర్ఘచర్చ జరిగే అవకాశం ఉంది.  

 పకడ్బందీగా చట్టం అమలు 
మారుతున్న ఫారెస్టు చట్టాల ప్రకారం గతంలో అడవిలో చెట్లు నరికితే ఏడాది కాలం జైలు శిక్ష ఉండేది. మారిన చట్టాల ప్రకారం కనీసం మూడేళ్లు జైలుశిక్ష, రూ.ఐదువేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేట్‌ ప్రదేశాల్లో ఎక్కడ చెట్లు నరికినా కఠినచర్యలు తప్పవు. చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలంటే అవసరమైన సిబ్బందిని నియమిస్తే బాగుంటుంది.  – బాబ్జిరావు, జిల్లా అటవీ అధికారి, వనపర్తి   

మరిన్ని వార్తలు