మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ చిన్న కుమారుడు మృతి

3 Mar, 2020 07:34 IST|Sakshi
అంతిమ యాత్ర.. రాజుకుమార్‌ యాదవ్‌ (ఫైల్‌ )

గచ్చిబౌలి: శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్‌ చిన్న కుమారుడు రాజ్‌ కుమార్‌ (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌ అపోలో హస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. భిక్షపతియాదవ్‌కు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు రాజ్‌ కుమార్‌ కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మసీద్‌బండలోని నివాసంలో పార్థీవదేహాన్ని ఉంచారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌కు భార్య, ఓ కుమారుడు(25) ఉన్నారు.

భిక్షపతి యాదవ్‌కు బంధువైన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మసీద్‌బండలో రాజ్‌కుమార్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, జైపాల్‌ యాదవ్, బాల్క సుమన్, శ్రీధర్‌ బాబు, మాజీ మంత్రి కె.జానా రెడ్డి, మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి, వంశీచందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు యోగానంద్, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, హమీద్‌పటేల్, జగదీశ్వర్‌ గౌడ్, బొబ్బ నవతా రెడ్డి, దొడ్ల వెంకటేష్‌ గౌడ్,  వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజ్‌ కుమార్‌ యాదవ్‌ పార్థీవ దేహం పై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. భిక్షపతియాదవ్‌ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. 

మరిన్ని వార్తలు