గణేష్ ఉత్సవాలుప్రశాంతంగా జరగాలి

24 Aug, 2014 02:24 IST|Sakshi

ఉత్సవ కమిటీ సభ్యులతోకలెక్టర్ ఇలంబరితి
 
ఖమ్మం జడ్పీసెంటర్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగేలా సహకరించాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి కోరారు. వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై ఉత్సవ కమిటీసభ్యులతో కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 29న వినాయక చవితిని పురష్కరించుకుని నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జన వేడుకలకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
 
 విగ్రహాలు ఏర్పాటు చేసే ముందు ఆయా ప్రాంతాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో అనుమతి పొందాలన్నా రు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖ నిర్దేశించిన సమయంలోనే లౌడ్ స్పీకర్లు వినియోగించాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ మట్టి విగ్రహాలను వినియోగించాలన్నారు. ఆ దిశగా కమిటీ సభ్యులు ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌కో నిర్దేశించిన రుసుం చెల్లించి ప్రత్యేక కనెక్షన్ పొందాలన్నారు.
 
 గణేష్ నిమజ్జనానికి ఖమ్మంలోని మున్నేరు వద్ద అధికార యంత్రాంగం ప్రతి ఏటా మాదిరిగా అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. క్రేన్ల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని మత్స్య శాఖ సహాయ సంచాలకులకు సూచిం చారు.  నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఓఎస్‌డీ వై.వి.రమణకుమార్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు చ ర్యలు చేపట్టాలన్నారు. సబ్‌డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
 
 ఉత్స వ కమిటీలు పోలీసులకు సహకరించి ఉత్సవాలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని, మండపాల వద్ద రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వొద్దని సూచించారు. విగ్రహ మండపాల వద్ద ప్రతి రోజూ కమిటీ సభ్యులలో ఎవరైన ఒకరు తప్పని సరిగా ఉండాలన్నారు. నిమజ్జనం రోజున గుర్తిం చిన మార్గాల ద్వారానే విగ్రహాలను తరలించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్, డీఆర్వో శివశ్రీనివాస్, సీపీఓ రత్నబాబు, డీపీఓ రవీందర్, జేడీఏ భాస్కర్‌రావు, స్తంబాద్రి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జయచంద్రారెడ్డి, అధ్యక్షుడు వెంపటి లక్ష్మీ్ష్మ నారాయణ, ఉపాధ్యక్షుడు గంటెల విద్యాసాగర్, కార్యదర్శి అశోక్‌లాహోటి, కన్వీనర్ విజయ్‌కుమార్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు