వర్ధన్నపేట అభ్యర్థిని ప్రకటించని మహాకూటమి

17 Nov, 2018 12:16 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఓ వైపు ఎన్నికల ప్రచా రాన్ని నియోజకవర్గాల్లో పలు రాజకీయ  పార్టీలు జోరుగా నిర్వహిస్తుంటే.. మరికొన్ని పార్టీలు మాత్రం తమ అభ్యర్థులనే ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల గడువు సమీపిస్తున్నా అభ్యర్థుల ప్రకటన పూర్తి కాలేదు. సెప్టెంబర్‌ 6న ప్రభుత్వాన్ని రద్దు చేశాక టీఆర్‌ఎస్‌ అధినేత 105 మంది ఎమ్మె ల్యే అభ్యర్థులను వెంటనే ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేశ్, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్‌ రెడ్డి, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి పేర్లు ఉన్నాయి. ఇటీవల బీజేపీ పరకాల నుంచి డాక్టర్‌ పెసరు విజయచందర్‌ రెడ్డి, వర్ధన్నపేట నుంచి కొత్త సారంగరావు, మహాకూటమి తరఫున పరకాల నుంచి కొండా సురేఖ, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డిని ప్రకటించారు. ఇంకా జిల్లాలో మహకూటమి తరఫున వర్ధన్నపేట అభ్యర్థిని ప్రకటించలేదు.

వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థి ఎవరో? 
వర్ధన్నపేట మహాకూటమి అభ్యర్థిని ఇంత వరకు ప్రకటించలేదు. మహాకూటమిలోని టీజేఎస్‌ 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అందులో వర్ధన్నపేట  నియోజకవర్గాన్ని తెలంగా ణ జన సమితి(టీజేఎస్‌)కి కేటాయించినట్లు ఇప్పటికే ఆ పార్టీ తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీకే కేటా యించాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు తన అనుచరులు గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. ఓ వైపు నామినేషన్ల గడువు దగ్గర పడుతుంటే అభ్యర్థుల ప్రకటనలో కూటమి తర్జనభర్జన పడుతోంది.టీజేఎస్‌ తరఫున  పగిడిపాటి దేవయ్యని నిలబెడతారని సమాచారం. ఇప్పటికే దేవ య్యప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకున్నారు.

సమీపిస్తున్న గడువు
పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల గడువు సమీపిస్తోంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల గడువు ఈ నెల 19వ తేదీతో ముగియనుంది.  ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్‌ ఉపసంహరణ తుది గడువు ఉంటుంది. గడు వు సమీపిస్తున్నా మహాకూటమి అభ్యర్థిని ప్రకటిం చకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఓ పక్క టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూ సుకెళ్తుండగా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయా పార్టీల కార్యకర్తలు నిరాశకు లోనవుతున్నారు.

మరిన్ని వార్తలు