గ్రానైట్‌కు అక్రమ విద్యుత్

18 Mar, 2016 03:35 IST|Sakshi
గ్రానైట్‌కు అక్రమ విద్యుత్

స్తంభాలు వేసుకుని యథేచ్చగా వినియోగం
ఆలస్యంగా తేరుకున్న సెస్
జరిమానాతో సరి..!

 
 
 వేములవాడ రూరల్ : నిరుపేదలు విద్యుత్ స్తంభాలకు వైర్లు తగిలించి తమ ఇళ్లలో ఒక్క బల్బు వెలిగించుకుంటే కేసులు నమోదు చేసి, వారిని ముప్పు తిప్పలు పెట్టడం సెస్ అధికారులకు పరిపాటి. కానీ ఒక బడా వ్యాపారి తన వ్యాపారానికి కావాల్సిన విద్యుత్‌ను చోరీ చేసినా, ఎలాంటి అనుమతి లేకుండా ఏకంగా పోల్స్ వేసుకున్నా పట్టించుకోరు! వేలాది రూపాయల విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకుంటే కేసు నమోదు చేయకుండా కేవలం జరిమానాతో సరిపెట్టడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం.

వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ శివారులోని ఒక గ్రానైట్ క్వారీ యజమాని తన క్వారీలో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకుంటున్నాడు. 12 స్తంభాలను ఏర్పాటు చేసుకుని, దానికి సెస్ విద్యుత్ వైరు కనెక్షన్ కలుపుకుని, 5హెచ్‌పీ, 7హెచ్‌పీ మోటార్లు బిగించుకుని విద్యుత్‌ను వాడుకుంటున్నాడు. చాలాకాలంగా విద్యుత్ అక్రమ వినియోగం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తుండగా.. సెల్ అధికారులు ఆలస్యంగా గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. గురువారం సెస్ ఎండీ నాంపల్లిగుట్ట సదరు గ్రానైట్ క్వారీని తనిఖీ చేయడంతో విద్యుత్ అక్రమ వినియోగం వెలుగులోకి వచ్చింది. దీనివెనుక సెస్ అధికారులతోపాటు ఇటీవల సెస్ డెరైక్టర్‌గా ఎన్నికైన అధికార పార్టీ నాయకుని హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 సెస్ నుంచే స్తంభాలు సరఫరా..?
గ్రానైట్ క్వారీ యజమాని వేసుకున్న 12 విద్యుత్ స్తంభాలు, దానికి సరిపడా విదుత్ వైర్లు సిరిసిల్ల సెస్ నుంచే సరఫరా అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి అదే కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు సహకరించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సెస్ సిబ్బందే విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను వారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని విషయూలు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.

 సిబ్బంది మధ్య విభేదాలతో...!
 గ్రానైట్ క్వారీకి విద్యుత్ పోల్లను, వైర్లను వేసిన సెస్ సిబ్బంది మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటపడిందని తెలుస్తోంది. గురువారం సెస్ ఎండీ నాంపల్లిగుట్ట క్వారీని పరిశీలించడంతో అక్రమ విద్యుత్ వినియోగం విషయం బయటపడింది. ప్రతి గ్రామానికి ఒకరిద్దరు సెస్ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ పనులను ఆ ఎందుకు గుర్తించలేదనే అనుమానం రాక మానదు.

 అధికార పార్టీ నాయకుడి ఒత్తిడి..?
 సెస్ పరిధిలో పనిచేసిన లైన్‌మెన్‌లపై ఒక అధికార పార్టీ నాయకుడు ఒత్తిడి తీసుకువచ్చి ఈ గ్రానైట్ క్వారీకి విద్యుత్ పోల్లను, విద్యుత్  వైర్లను వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడింతలు జరిమాన విధిస్తాం  -సెస్ ఎండీ నాంపల్లిగుట్ట

గ్రానైట్ క్వారీ యజమాని అక్రమంగా విద్యుత్‌ను వా డుకుంటున్నట్లు సెస్ ఎండీ నాంపల్లిగుట్ట ధ్రువీకరిం చారు. విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటుట్లు తెలి యడంతో తాను వెళ్లి పరిశీలించానని చెప్పారు. గత ఆ రు నెలల్లో క్వారీకి వచ్చిన విద్యుత్ బిల్లులపై మూడిం తల జరిమాన విధిస్తామన్నారు. ఈ విషయూన్ని సెస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. విద్యుత్ పో ల్లు, వైర్ల విషయమై ప్రశ్నించగా... క్వారీ యజమాని బయట నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు చెప్పాడని, ర శీదు మాత్రం చూపించలేదని తెలిపారు.

 బ్లాస్టింగ్‌కు అనుమతులు ఉన్నాయా..?
గ్రానైట్ క్వారీకి బ్లాస్టింగ్ అనుమతులు ఉన్నాయా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా గ్రానైట్ క్వారీ నిర్వహిస్తుండగా, వేల సంఖ్యలో బ్లాస్టింగ్‌లు చేసినట్లు క్వారీలో చూస్తే తెలుస్తోంది. అనుమతులు లేకుండా విద్యుత్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో బ్లాస్టింగ్‌ల అనుమతులు తీసుకున్నారా..? అనేది సందేహమే. ఇప్పటికైనా జిల్లా అధికారులు పూర్తిస్థారుులో విచారణ జరిపి అక్రమాలను అరికట్టాల్సిన అవసరముంది.

మరిన్ని వార్తలు