హారాల కోసమే హత్య

13 Mar, 2014 00:55 IST|Sakshi
హారాల కోసమే హత్య

పక్షం రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో కారులో శవమై కనిపించిన నగల వ్యా పారి హత్య కేసులో మిస్టరీని హుమాయున్‌నగర్ పోలీసులు ఛేదించారు. అతని వద్ద పనిచేస్తున్న ఇద్దరు కమీషన్ ఏజెంట్లు రూ.30 లక్షల విలువైన ముత్యాల హారాలను దోచుకునేందు కు ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు.

పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్ర కారం...హుమాయున్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్‌మోయిన్ (35) ముంబై నుంచి బంగా రం, ముత్యాల హారాలను తీసుకొచ్చి నగరం లో విక్రయిస్తుంటాడు. ఇతని వద్ద మసాబ్‌ట్యాంక్‌కు చెంది న మహ్మద్ ఇర్ఫాన్ (22), సోమాజిగూడకు చెందిన సయ్యద్ జునైద్ అలీ (21)లు ఐదు నెలలుగా కమీషన్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. నగలను అమ్మిపెట్టే క్రమంలో ఇర్ఫాన్, జునైద్‌లు మోయిన్‌కు రూ.1.80 లక్షలు బాకీ పడ్డారు. ఈ డబ్బును చెల్లించాలని మోయిన్ ఒత్తిడి చేస్తుండటంతో అతడ్ని హత్య చేయాలని ఇర్ఫాన్, జునైద్‌లు పథకం వేశారు.

నగలు ఖరీ దు చేసేందుకు ఓ వినియోగదారుడు తమ వద్ద ఉన్నాడని, నగలు తీసుకుని బంజారాహిల్స్ రోడ్డు నెం.12లోని ఓ అపార్ట్‌మెంట్‌కు రావాల ని గతనెల 25న మోయిన్‌ను పిలిచారు.  మ ద్యాహ్నం 2.45కి  మోయిన్ రూ.30 లక్షల విలువైన ముత్యాల హారాలను తీసుకుని ఇర్ఫాన్, జునైద్‌లు ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు.  మోయిన్ చేతిలో ఉన్న ముత్యాల హారాలను జునైద్ లాక్కోగా... ముఖంపై ఇర్ఫాన్ దుప్పటి కప్పి, సుత్తెతో తలపై మోది హత్య చేశాడు. అదే రోజు రాత్రి హతుడు మోయిన్ కారులోనే  శవాన్ని మహబూనగర్ జిల్లా రాయికల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపైకి తరలించారు.

శవంతో పాటు కారును అక్కడే వదిలి,  బస్సులో నగరానికి చేరుకున్నారు. మరుసటి రోజు మహబూబ్‌నగర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. అప్పటికే కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మోయిన్ అదృశ్యమైనట్టు హుమాయున్‌నగర్ ఠాణాలో  కేసు నమోదైంది. రాయకల్  గ్రామం వద్ద కారులో లభించిన శవం మోయిన్‌దేనని హుమాయున్‌నగర్ డీఐ జి.రాజు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

కారు ప్రయాణం చేసిన టోల్‌గేట్‌ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల మేరకు ఇర్ఫాన్, జు నైద్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేశామని వెల్లడించారు. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడంతో మోయిన్ వద్ద కమీషన్ ఏజెంట్‌గా చేరామని, అయితే, ఆ శించినట్టు డబ్బు రాకపోవడంతో  ఏకంగా మొత్తం నగలనే కాజేసేందుకు హత్య చేశామని అంగీకరించారు. విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ రామచంద్రన్ ఏసీపీ డి.శ్రీనివాస్, సీఐ ఎస్.రవీందర్ పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు