జీఎన్‌ రావును ఆదర్శంగా తీసుకోవాలి 

8 Mar, 2019 00:37 IST|Sakshi

సిద్దిపేట మెడికల్‌ కాలేజీని సందర్శించిన హరీశ్‌రావు 

సిద్దిపేట కమాన్‌: సర్వీస్‌ టు ది నేషన్‌.. సర్వీస్‌ టు ది పీపుల్స్‌.. వంటి గొప్ప సేవా భావం కలిగిన డాక్టర్‌ జీఎన్‌ రావును యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మీలో చాలామంది ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ జీఎన్‌ రావు అంతంటి వాళ్లు కావాలని సిద్దిపేట మెడికల్‌ కళాశాల విద్యార్థులకు సూచించారు. డాక్టర్‌ జీఎన్‌ రావుతో కలిసి హరీశ్‌రావు గురువారం సిద్దిపేట మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రిని సందర్శించారు. మెడికల్‌ కాలేజీ ఫస్టియర్‌ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. దక్షిణ భారతదేశంలోని 4రాష్ట్రాల్లో 200 ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రులు ఉన్నాయని, వీటి ద్వారా 26 లక్షల మిలియన్ల మంది ప్రజలకు 50 శాతం ఉచిత వైద్యసేవలు అందుతున్నాయ న్నారు.  

అత్తకు కూడా అన్నం పెడుతున్నాం... 
ఆస్పత్రిలోని పేషెంట్‌ వార్డులో దుద్దెడ గ్రామానికి చెందిన లచ్చవ్వతో వైద్య సేవలు అందుతున్న తీరును హరీశ్‌ అడిగి తెలుసుకున్నారు.  ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని తెలిపింది.   అన్నం తిన్నవా.. లేదా అని హరీశ్‌ ఆరా తీయ గా.. తిన్నం సారూ అని బదులిచ్చింది. ఆస్పత్రి బావుంది. ఇంతకుముందులా లేదు. ఇప్పుడు అద్దంలా మెరుస్తోంది అని ఆమె చెప్పడంతో హరీశ్‌రావు, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి చైర్మన్‌తోపాటు వైద్యాధికారుల మొహాల్లో చిరునవ్వులు కనిపించాయి. రీసెర్చ్‌ చేస్తే మెడికల్‌ సైన్స్‌కు హెల్ప్‌ అవుతుందని, ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత చాలా ఆప్షన్స్‌ ఉన్నాయని విద్యార్థులకు డాక్టర్‌ రావు సూచించారు. మీరంతా హరీశ్‌రావులా గొప్ప వాళ్లు కావాలన్నారు.    

మరిన్ని వార్తలు