పింఛనులో కోత సమంజసం కాదు

16 Jun, 2020 04:41 IST|Sakshi

ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో మీ విధానం చెప్పండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నిర్ణయంపై ప్ర భుత్వ విధానం ఏమిటో రెండు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఇప్పటికే చాలా వాయిదాలు ఇచ్చామని, ఇకపై గడువు కోరకుండా 48 గంటల్లో ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని కోరింది. ప్రభుత్వ ఉద్యో గుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌ చెల్లింపుల్లో కోత విధిస్తూ మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను సవాల్‌ చేస్తూ తెలంగాణ పెన్షనర్స్‌ జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య, రిటైర్డు ఏఈ డి.లక్ష్మీనారాయణ, రిటైర్డు హెచ్‌ఎం నారాయణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది.

పెన్షన్‌లో కోత సమంజసం కాదు. కోత విధించాలనే జీవో చట్టబద్ధంగా లేదనిపిస్తోం ది. ఏచట్టం కింద కోత విధించారో ప్రభు త్వం తెలియజేయాలి. ప్రభుత్వ దయతో పెన్షన్‌ ఇవ్వడం లేదు. విపత్తుల నివారణ చట్టంలో కూడా పెన్షన్లను కోత విధింపు అంశం లేదు. ఆర్థిక ఎమర్జెన్సీ విధించినప్పు డు మాత్రమే కోత వి«ధింపునకు వీలుంటుం ది.ఇప్పుడేమీ ఆ పరిస్థితులు ఏమీ లేవు. చాలా మంది పెన్షనర్లు పెన్షన్‌పైనే ఆధారపడతారు. పెన్షన్‌లో కోత విధింపు పెన్షనర్లను శిక్షించడమే అవుతుంది. జీవోను రద్దు చేస్తాం..అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మరో సందర్భంలో, ‘వయసుపైబడిన పెన్షనర్ల కష్టాలు గురించి ప్రభుత్వానికి తెలియదా. పిల్లలు పట్టించుకోక పెన్షన్‌పైనే ఆధారపడే వాళ్ల పరిస్థితి ఏం కావాలి.

పిల్లలు లేని వారు, పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల, పెన్షన్‌ వస్తోందని పట్టించుకోని పిల్లల వల్ల వృద్ధాశ్రమాల్లో ఉండే వారి కష్టాల కోణంలో చూడాలి. మానవీయకోణంలోనూ ప్రభుత్వం ఆలోచన చేయాలి.. అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌. ప్రసాద్‌ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జీఎస్టీ వాటా ఇవ్వలేదని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని అది నిజమే కావచ్చునని, అలాగని మరో తప్పు చేస్తే ఎలాగని ప్రశ్నించింది. పిల్స్‌ దాఖలైన తర్వాత గతంలో 50 శాతంగా ఉన్న పెన్షన్‌ను 75 శాతానికి పెంచి చెల్లించామన్నారు.. ఇప్పుడు 25 శాతమే కోత అమల్లో ఉందన్నారు. అయితే బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. జులై మొదటి వారం వరకూ విచారణ వాయిదా వేస్తే పూర్తి వివరాలతో వాదనలు వినిపిస్తామని ఏజీ కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. పిల్స్‌ దాఖలై 2 నెలలైందని ఇక వాయిదా వేసే ప్రసక్తే లేదని, ప్రభుత్వ విధానాన్ని 48 గంటల్లోగా తెలియజేయాల్సిందేనని తేల్చి చెప్పింది. విచారణను 17కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు