మరో మూడు రోజుల పాటు వర్షాలు

7 Jul, 2018 21:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 7.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ
అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి  వర్షాలు కురిసే​ అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తాంధ్ర
ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలతోపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాయలసీమ
అల్పపీడనం కారణంగా రాయలసీమ మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది.

నగరంలో పలు చోట్ల వర్షాలు
నగరంలో శనివారం పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఉప్పల్‌, రామంతపూర్‌, మేడిపల్లి, ఘట్కేసర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, చైతన్యపురి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. మలక్‌పేట​, చంపాపేట, చదర్‌ఘూట్‌, భవానీ నగర్‌ ప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. గోల్కొండ ప్రాంతంలో 3 సెం.మీ, జూ పార్క్‌ పరిసర ప్రాంతాల్లో 3.7సెం.మీగా వర్షాపాతం నమోదయింది.

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
నగరంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురవడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు