సాక్షి ఎఫెక్ట్‌ : ఐఎంఎస్‌ స్కాం.. రంగంలోకి ఇంటెలిజెన్స్‌ 

30 Sep, 2019 04:29 IST|Sakshi

విజిలెన్స్‌ తనిఖీల సమయంలో సెలవులో ఉన్న వారిపై నజర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సరీ్వసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ‘ఎవరా ఐఏఎస్‌ అధికారి?’అంటూ ఆదివారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి సీఎంవో నుంచి స్పందన వచి్చంది. ఈ కేసులో ఇప్పటికే ఆధారాల కోసం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గాలిస్తుండగానే.. ఇంటెలిజెన్స్‌ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

ఐఏఎస్‌ నుంచి అటెండర్‌ దాకా అందరిపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారంపై ఇటీవల సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ, కోట్ల రూపాయల కుంభకోణంలో సాక్షాత్తూ సీఎం ఇంటిపేరును వాడుకోవడం చర్చనీయాంశమైంది. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’అన్నట్లుగా వారు చేసే అక్రమాలకు జాయింట్‌ డైరెక్టర్‌ కల్వకుంట్ల పద్మ తనకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంధువు అని పలువురిని బెదిరించడం గమనార్హం. సీఎం ఇంటిపేరు వాడుకున్న విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారులను ఆరాతీసినట్లు సమాచారం. 

తనిఖీల రోజు ఎవరెవరు లీవ్‌? 
విజిలెన్స్‌ తనిఖీలు జరిగిన తేదీల్లో ఈ కుంభకోణంతో సంబంధమున్న ఉద్యోగుల్లో ఎవరెవరు సెలవుపై వెళ్లారన్న వివరాలను ఇంటెలిజెన్స్‌ అధికారులు సేకరిస్తున్నారు. నిందితుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలపైనా రహస్యంగా ఆరా తీస్తున్నారు. బిల్లులు మంజూరైన తేదీల్లో ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు అధికంగా వచ్చి చేరాయి? విదేశాలకు ఏమైనా డబ్బులు తరలించారా? మెడికల్‌ కంపెనీలు సమరి్పంచిన చిరునామాల్లో సదరు కంపెనీలు ఉన్నాయా? లేవా? అనే విషయాలపైనా కూపీ లాగుతున్నారని సమాచారం. 

మందుల సరఫరాలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు? నగదు విషయాలు ఎవరు చూసుకునేవారు? వాటాలు ఎలా పంచేవారు? అనే విషయాలపై కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. కాగా, ఈవ్యవహారం కార్మికసంస్థ సోమవారం గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోలోని సీపీఎం కార్యాల యంలో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేయనుంది.

మరిన్ని వార్తలు