వీరభద్రీయుల అభివృద్ధికి కృషి చేయాలి

10 Jun, 2014 04:01 IST|Sakshi

కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : తెలంగాణలోని వీరభద్రీయ కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని వీరభద్రీయ కులసంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు మిట్టపెల్లి సాంబయ్య కోరారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని అన్నారు. వీరభద్రీయ కులసంఘం ఐక్యవేదిక ఫెడరేషన్ ప్రత్యేక సమావేశం సోమవారం కాశిబుగ్గలోని కేవీఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.

రాష్ట్ర పరిధిలోని 10 జిల్లాల నుంచి కులస్తులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా సాంబయ్య మా ట్లాడుతూ వీరభద్రీయులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10లక్షల మంది ఉన్నారని, వీరంతా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వె నుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులసంఘాలకు ప్రభుత్వాలు ఏదో విధంగా ఆదుకుంటున్నా అల్యూమినియం, వంట పాత్రలు విక్రయిస్తూ జీవిస్తున్న వీరభద్రీయులకు ఎలాంటి రుణాలు, ఆర్థికపరమైన సహాయం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయ డం లేదన్నారు.

సంచార జీవితం గడుపుతు న్న వీరు సరైన ఐక్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయా న్ని బీసీ కమిషనర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి ని కలసి విజ్ఞాపన పత్రం ఇస్తామని సమావేశంలో నిర్ణయించారు. వీరభద్రీయుల విద్యార్థులు బీసీ-ఏలో ఉన్నా సరైన గుర్తింపు లభిం చడం లేదన్నారు. ఈ కులస్తుల పిల్లలు ఇప్పటికే చదువుల్లో సైతం వెనుకబడి ఉన్నారని, ప్రోత్సహించాల్సిన అవసరం పాలకులపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యదర్శి కర్నె శివకుమార్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని వారితో ప్రమాణస్వీకారం చేయిం చారు. వీరభద్రీయుల కుల సంఘాలకు సంబంధించిన సీడీని ఆవిష్కరించారు.
 
విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
 
తెలంగాణ రాష్ట్ర పరిధిలోని జిల్లాల్లో ఉన్న కులస్తుల్లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశారు. ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు నూతన కార్యవర్గం పేర్కొంది. సమావేశంలో కార్యవర్గం ముఖ్య ప్రతినిధులు జి.ఉప్పలయ్య, వరంగల్ టౌన్ అధ్యక్షుడు ఎం.సదానందం, కార్యదర్శి ఎం.సూరయ్యతోపాటు పది జిల్లాలకు చెం దిన వీరభద్రీయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు