‘యాదాద్రి’పై ఐటీ నజర్!

12 Dec, 2016 14:57 IST|Sakshi
‘యాదాద్రి’పై ఐటీ నజర్!

- దేవస్థానంలో ‘పెద్ద’ నోట్లను మార్పిడి చేస్తున్నారని ఫిర్యాదులు
- భక్తుల రూపంలో రహస్య విచారణ చేస్తున్న అధికారులు
 
 యాదగిరికొండ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దృష్టి పెట్టారు. దేవస్థానం అధికారులు రూ.500, రూ.1,000 నోట్లను పెద్ద ఎత్తున మార్పిడి చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు.. కొందరు అధికారులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. వారు భక్తుల రూపం తిరుగుతూ నగదు మార్పిడికి ఏ విధంగా జరుగుతోంది, సహకరిస్తున్న అధికారులెవరనే విషయాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ప్రసాద విక్రయశాల, టికెట్ కౌంటర్లు సహా పలు సెక్షన్ల వద్ద నిఘా పెట్టి.. రూ.500, రూ.వెయ్యి నోట్లను చిల్ల రగా మార్చుకుని వెళ్తున్న వారిని గమనిస్తున్నారని తెలుస్తోంది. ఇక దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇటు ఉద్యోగం చేస్తూ, మరోవైపు వ్యాపారాలు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారని, పన్నులు ఎగవేస్తున్నారనే సమాచారంపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు