ఏం చర్యలు తీసుకుంటున్నారు.. | Sakshi
Sakshi News home page

ఏం చర్యలు తీసుకుంటున్నారు..

Published Wed, Nov 23 2016 3:21 AM

ఏం చర్యలు తీసుకుంటున్నారు.. - Sakshi

- సామాన్యులకు ఇబ్బందులను దూరం చేసేందుకు ఏం చేశారు
- పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి
- నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
- విచారణ మూడు వారాలకు వారుుదా  
 
 సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు.. ముఖ్యంగా రోజూ వారీ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జీవనోపాధి లేక పస్తులు ఉంటున్నారని, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ రియాజుద్దీన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యా జ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రోజూ వారీ కూలీలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు నోట్ల రద్దు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, పూట కూడా గడవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది యాసర్ మమూన్ తెలిపారు. వారికి తిండి, ఆర్థిక సా యం అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలన్నారు. ఈ సమయంలో ధర్మా సనం స్పందిస్తూ, నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలు కొన్ని వారాల్లో పరిష్కారమవు తాయని చెబుతున్నారని వ్యాఖ్యానించింది.

 నోట్ల రద్దు పెద్ద విషయం.. సంయమనం పాటించాలి
 నోట్ల రద్దుకు సంబంధించిన వ్యాజ్యాలపై కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లుందని, దాని సంగతేమిటని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది బి.నారాయణరెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. నోట్ల రద్దుపై అన్ని హైకోర్టుల్లోని కేసులను బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసిందని, దానిపై బుధవారం విచారణ జరగనుందని ఆయన తెలిపారు. తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి పాలు, ఇతర ఆహారపదార్థాలు అందించడంతో పాటు తదుపరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాసర్ కోరారు.

ఎవరు.. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో నిర్దిష్టంగా చెబితే వారికి సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు వీలవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్య దేశవ్యాప్తంగా ఉందని యాసర్ చెప్పడంతో, అటువంటప్పుడు తాము ఆదేశాలు ఎలా ఇవ్వగలమని, కొన్ని విషయాల్లో న్యాయస్థానాలు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుందని, నోట్ల రద్దు పెద్ద విషయమని, కొన్ని సమస్యలు ఉంటాయని, వాటిని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే పిటిషనర్ కోరినవన్నీ చేయడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.

Advertisement
Advertisement