'క్యాంపు రాజకీయాలు చేసినందునే మంత్రి అయిన కేసీఆర్'

25 Nov, 2014 20:21 IST|Sakshi
ఎర్రబెల్లి దయాకర రావు

హైదరాబాద్: వైశ్రాయ్లో బాగా క్యాంపు రాజకీయాలు చేసినందునే కె.చంద్రశేఖర రావు ఆనాడు మంత్రి అయ్యారని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. తెలంగాణకు బద్ద వ్యతిరేకులతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. శాసనసభ నడుస్తుండగా ఇందిరా పార్క్లో ఎప్పుడూ ఇన్ని ధర్నాలు జరుగలేదని చెప్పారు.

టీడీపిని తిట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. శాసనసభలో తమకు రూమ్ కేటాయించకపోగా, తమను వేరే చోట కూర్చోమంటున్నారని చెప్పారు. స్పీకర్ను పరోక్షంగా హరీష్ రావు నడిపిస్తున్నారన్నారు.  ఏపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీనా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు తాము ద్రోహం చేయలేదని ఎర్రబెల్లి అన్నారు.
**

మరిన్ని వార్తలు