టీఆర్‌ఎస్‌తో దోస్తానీ చేస్తే ఏదైనా చెయ్యొచ్చా?

14 May, 2019 15:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అంబర్‌పేట్‌లోని జాతీయ రహదారిలో ఉన్న మజీద్‌ విషయంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ ప్రశాంతతను, మత సామరస్యాన్ని మజ్లీస్‌ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ సమస్య వచ్చిందని.. అక్కడ లేని మసీద్‌ను ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో దోస్తానీ చేస్తే ఏమైనా చెయ్యొచ్చా అని నిలదీశారు. దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్కడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం 281 ప్రాపర్టీస్‌ను స్వాధీనం చేసుకున్నారని, 170మందికి పరిహారం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

అది మసీద్‌ స్థలమని మజ్లీస్‌ ఆరోపిస్తున్న దానికి కూడా పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ల్యాండ్‌ ఓనర్‌ కూడా డబ్బులు తీసుకున్నారని, 2018 ఫిబ్రవరిలో చెక్‌లు ఇచ్చామని, ముగ్గురు అన్నదమ్ములకు 2 కొట్ల 52లక్షలు చెల్లించామని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లోనే అక్కడ నిర్మాణాన్ని తొలగించామన్నారు. అది ప్రైవేట్‌ ప్రాపర్టీ అని, పోలీసులను పక్కన పెట్టుకుని ఎమ్‌ఐఎమ్‌ ఎమ్మెల్యే పాషా ఖాద్రి అక్కడ నమాజ్‌ చేశారని పేర్కొన్నారు. అన్నీ తెలిసిన పోలీస్‌ కమీషనర్‌ మజ్లీస్‌కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో చెప్పాలన్నారు. ఆ ల్యాండ్‌ ఓనర్లు కూడా అక్కడ మసీద్‌ లేదని ఫిర్యాదు చేశారని అన్నారు. ఒక్క ఎమ్‌ఐఎమ్‌ పార్టీ తప్పా మిగిలిన అన్ని పార్టీలు ఒక్క తాటిపై ఉన్నాయని తెలిపారు. హోం మినిష్టర్‌ మాట మార్చి.. మసీద్‌ నిర్మాణం చేస్తామని చెబుతున్నారు.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మసీద్‌ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని.. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సీఎస్‌ను కలుస్తామన్నారు.

మరిన్ని వార్తలు