కొండాపూర్‌ వద్ద ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన

20 Jul, 2018 14:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌కు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను రూ. 263 కోట్లతో నిర్మించనున్నారు. గచ్చిబౌలి నుంచి హాఫిజ్‌పేట్ మార్గంలో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే రూట్.. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీ రోడ్లను కలుపుతూ ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగనుంది.  హైటెక్‌సిటీ పరిసరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఈ నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ ఉపయోగపగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సరికొత్త ప్లై ఓవర్‌తో గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌ మీదుగా హఫీజ్ పేట ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు తెరపడుతుందన్నారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే రూట్.. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీరోడ్లను కలుపుతూ ఈ నిర్మాణం సాగుతుందని తెలిపారు. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మాణం కొనసాగుతుందని వాటిని దశవారీగా ప్రారంభోత్సవాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు