లారీల సమ్మె ఉధృతం

23 Jul, 2018 11:21 IST|Sakshi
మాట్లాడుతున్న మధుసూదన్‌రావు

ఖిలా వరంగల్‌: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యనమానులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆలిండియా, తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  వరంగల్‌ జిల్లా, వరంగల్‌ లోకల్, ఓరుగల్లు లోకల్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నిత్యావసరాల సరుకుల తప్పా సిమెంట్, ఐరన్, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది.  జిల్లాలో 3వేల లారీలు నిలిచిపోగా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వేల లారీలు సరుకులతోనే రహదారులపై నిలిచిపోయాయి. తరచూ పన్నులను పెంచుతున్న  కారణంగా వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

పలు చోట్ల రాస్తారోకోలు..
వరంగల్‌ లోకల్‌ లారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేముల భూపాల్‌ ఆధ్వర్యంలో  ఆదివారం పలు చోట్ల «రాస్తారోకోలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేట, ములుగురోడ్డు, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ప్రధాన రహదారుల్లో జిల్లా మీదుగా వెళ్తున్న వివి«ధ రాష్ట్రాల లారీలను అడ్డుకుని ఖాళీ స్థలాలకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్‌ గంజ్‌ పోలీసులు లారీల పార్కింగ్‌ స్థలానికి చేరుకుని నిలిచిపోయిన లారీలను పంపించి వేముల భూపాల్‌తోపాటు మధుసూదన్‌రావును అరెస్టు చేసి, సొంతపూచి కత్తుపై విడుదల చేశారు.

కాగా ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ జె. మధుసూదన్‌రావు తెలిపారు. వరంగల్‌ లోకల్‌ లారీ అసోసియేషన్‌ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు వేముల భూపాల్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్‌ స్పందించి అసోసియేషన్‌ బాధ్యులను చర్చలకు ఆహ్వానించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ని త్యావసర సరుకులను సైతం అడ్డుకుంటామన్నారు. సమస్యలుపరిష్కరించే వరకు కొనసాగిస్తా మని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్లు మోహన్, శ్రీహరి, సతీష్, రాజు, ముంతా జ్, ఉస్సేన్, రాజీరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు