అల్లుడే సూత్రధారి..!

25 Dec, 2014 03:50 IST|Sakshi
అల్లుడే సూత్రధారి..!

వీడిన హత్యకేసు మిస్టరీ
* కుటుంబ తగాదాలే కారణం
* బంధువును పురమాయించి మట్టుబెట్టించిన వైనం
* నిందితుల అరెస్ట్, రిమాండ్
నకిరేకల్: నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ఈ నెల 8వ తేదీన చోటుచేసుకున్న వెల్లెంల భిక్షమయ్య (60) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో అల్లుడే సూత్రధారిగా వ్యవహరించి మామను హత్య చేయించాడని పోలీసుల విచారణలో తేలింది. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో  సీఐ శ్రీనివాసరావు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కారణాలు, హత్య జరి గిన తీరుతెన్నును వివరించారు.

కడపర్తి గ్రామానికి చెందిన వెల్లెంల భిక్షమయ్యకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు గతంలోనే చనిపోయాడు.  పెద్దకూతురు రజితను 2006లో తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రా మానికి చెందిన సువాల శ్రీనయ్యకు ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే కొద్ది రోజులకే వారి ని ఇళ్లరికం తీసుకువచ్చాడు. తదనంతరం జరి గిన పరిణామాల నేపథ్యంలో శ్రీనయ్య భార్య ను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. శ్రీనయ్యపై పెట్టిన వరకట్నం కేసులు కోర్టులో ఇప్పటికీ సాగుతున్నాయి. శ్రీన య్య ప్రస్తుతం జైళ్లోనే ఉన్నాడు.
 
జైళ్లో నుంచే హత్యకు పన్నాగం..!
తనను కటకటాల పాల్జేసిన మామ భిక్షమయ్యపై అల్లుడు శ్రీనయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని జైళ్లో నుంచే హత్యకు పన్నాగం పన్నాడు. ఇందుకు తన సమీ ప బంధువైన నల్లగొండ మండలం అక్కలయిగూడేనికి చెందిన మేడిపల్లి వెంకన్నను ఎంచుకున్నాడు. భిక్షమయ్యను హత్య చేయాలని పురమాయించాడు. ఇందుకు వెంకన్న, తన స్నేహితులైన కనగల్ మండలం జీ.చెన్నారం గ్రామానికి చెందిన ఆంజనేయులు, నల్లగొండలోని బొట్టుగూడకు చెందిన పర్వేజ్‌ను ఆశ్రయించా డు. ముగ్గురు కలిసి ఈ నెల 8వ తేదీన పల్సర్‌బైక్‌పై వచ్చి వ్యవసాయ క్షేత్రంలో నిద్రపోతున్న భిక్షమయ్యను కర్రలతో మోది హత్య చేశారు.
 
బైక్‌నంబర్  ఆధారంగా..
భిక్షమయ్యను హత్య చేసిన నిందితులు పల్సర్‌బైక్‌పై పారిపోతుండగా కడపర్తి గ్రామస్తులు గమనించారు. ఆ వాహనం నంబర్‌ను పోలీసులకు తెలపగా దాని ఆధారంగా నిందితులను గుర్తించినట్టు సీఐ వివరించారు. ముగ్గురు నిందితులను వారి స్వగ్రామాల్లోనే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ ప్రసాదరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.
 

మరిన్ని వార్తలు