మెట్రో ట్రయల్ రన్‌

24 Oct, 2015 00:31 IST|Sakshi
మెట్రో ట్రయల్ రన్‌

కేపీహెచ్‌బీ కాలనీ : మియాపూర్‌లోని మెట్రో రైల్ డిపో నుంచి ఎస్.ఆర్.నగర్ వరకు ట్రయల్ రన్‌లో భాగంగా గురువారం మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి. సుమారు 12 కిలోమీటర్ల మేర ట్రాక్‌పై మెట్రో రైళ్లు రాకపోకలు సాగించడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
 మియాపూర్ నుంచి భరత్ నగర్ వరకు ట్రాక్ నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ భరత్‌నగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇంతకాలంఎస్.ఆర్.నగర్ వరకు రాకపోకలు సాగించేందుకు వీలు కాలేదు. ఇటీవల బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్ రన్‌కు అవకాశం దక్కింది. ఈ ట్రయల్ రన్‌ను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎమ్‌డీవీబీ గాడ్గిల్ జెండా ఊపి ప్రారంభించారు.  50 కేఎంపీహెచ్ వేగంతో రైలును నడిపారు. రైలు వేగం, సిగ్నలింగ్, ట్రాక్‌లతో పాటు 18 రకాల ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు