తెలంగాణలో 1.175 కోట్ల మొక్కలు నాటాం

30 Nov, 2019 12:16 IST|Sakshi

తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన ‘దేశంలో పర్యావరణ పరిరక్షణ-అడవుల రక్షణ మొక్కల పెంపకం’ పై సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1.175 కోట్ల మొక్కలను నాటామని వెల్లడించారు.

అటవీ శాఖలో పోస్టుల భర్తీ..
24 శాతానికి తగ్గిపోయిన అడవులను 33 శాతానికి పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటవీ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాక భూగర్భ జలాలు, అడవులు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు దేశంలో ఎక్కడా రాకూడదని కోరుకుంటున్నానన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి జూట్, పేపర్ బాగ్స్ ను వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఇంద్రకరణ్‌ రెడ్డి కోరారు.

>
మరిన్ని వార్తలు