'మిషన్’పై విచారణ జరిపించాలి

16 May, 2016 04:45 IST|Sakshi
'మిషన్’పై విచారణ జరిపించాలి

టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి
23, 24 తేదీల్లో పార్టీ బృందం పరిశీలన

 
వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిష న్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల్లో అవినీ తి, అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల వర్క్‌షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయ టెండర్ల లో స్పీకర్, మంత్రులు జోక్యం చేసుకుంటూ ఈప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో జిల్లాలోని మిషన్ కాకతీయ పనులను టీడీపీ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తుందని తెలి పారు.

టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, విస్మరించిన హామీలపై జూన్ 2నుంచి సర్కార్‌పై దండయాత్ర కార్యక్రమా న్ని జిల్లాలో చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం టీఆర్‌ఎస్ కుట్రలో భాగమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క అన్నా రు. ఈనెల 21న జిల్లా కేంద్రంలో నిర్వహించే మినీ మహానాడును విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు కోరారు. జెడ్పీ వైస్‌చైర్మన్ చెట్టుపల్లి మురళి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు