‘టెక్‌’ ఎలక్షన్స్‌!

18 Sep, 2018 02:33 IST|Sakshi

ఎన్నికల్లో విస్తృతంగా ఐటీ వినియోగం

మొబైల్‌ యాప్‌లతో అనుమతులు, ఫిర్యాదులు

10 రకాల ఐటీ అప్లికేషన్లపై కలెక్టర్లకు శిక్షణ

డూప్లికేట్‌ ఓటర్ల తొలగింపు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో ఐటీ పరి జ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా వినియోగించుకోబోతోంది. పారదర్శకత కోసం పది రకాల ఐటీ అప్లికేషన్స్‌ను వాడనుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్న జిల్లా కలెక్టర్లకు ఈ అప్లికేషన్ల వినియోగంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.

ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఐటీ అప్లికేషన్ల వినియోగంపై కలెక్టర్లకు తర్ఫీదునిచ్చింది. వారంపాటు బ్యాచుల వారీగా కలె క్టర్లకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీలతో పాటు పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి కోరితే.. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి ముం దు అనుమతులు జారీ చేసేందుకు ‘సువిధ’ పేరుతో యాప్‌ను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు.

ఎన్ని కల సమయంలో ఎక్కడైనా అక్రమాలు, అవినీతి, డబ్బుల పంపిణీ చోటు చేసుకున్నా.. ఎన్నికల ప్రవ ర్తన నియమావళిని ఉల్లంఘించినా సామాన్య ప్రజ లు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమా చారం అందించే వీలుగా ‘సీ–విజిల్‌’పేరుతో మరో మొబైల్‌ యాప్‌ రూపొందించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనల ఫొటోలు, వీడియోలను తీసి ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల సంఘం ఈ యాప్‌ ఫిర్యాదులపై సమీక్ష జరుపుతుంది.

వీవీప్యాట్‌లపై అవగాహన
అత్యంత పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ చెప్పారు. యాప్‌ల వినియోగంపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రజత్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఉప ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్న జాయింట్‌ కలెక్టర్లు, వారి బృందంలోని ఐటీ అధికారులకు ఐటీ అప్లికేషన్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

తొలిసారిగా వినియోగించబోతున్న వీవీప్యాట్‌ యంత్రాల పట్ల అధికారులకు అవగాహన లేదని, శిక్షణలో భాగంగా వాటిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా మన్నారు. ఓటర్ల నమోదు కోసం ఈ నెల 15, 16వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రచారోద్యమ కార్యాక్రమా నికి వచ్చిన స్పందనపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో డూప్‌ ఓట్ల గుర్తింపు
ఓటర్ల జాబితాలో డూప్లికేట్‌ ఓటర్లును గుర్తిం చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రధానంగా ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, వయసు, ఫొటోలు, చిరు నామాల్లో పోలికల ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్‌ డూప్లి కేట్‌ ఓటర్లను గుర్తిస్తుందన్నారు.

డూప్లికేట్‌ ఓటర్లను తొలగించడంలో చట్టబద్ధంగా వ్యవహ రిస్తామని, 7 రోజుల ముందుకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేస్తామన్నారు. మరణించిన వ్యక్తుల పేర్లను మాత్రమే సుమోటోగా తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు.

బలంవతపు తీర్మానాలపై కఠిన చర్యలు..
ఫలానా పార్టీ లేదా అభ్యర్థికే ఓటేయాలని గ్రామాల్లో ప్రజలతో చేయిస్తున్న ప్రతిజ్ఞలు, తీర్మానాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యా దులు అందలేదని రజత్‌కుమార్‌ తెలి పారు. తీర్మానాలు, ప్రతిజ్ఞలు ఓటర్ల వ్యక్తిగత విషయాలని, అయితే, బలవంతంగా తీర్మా నాలు, ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్లు తమ దృష్టి కొస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వ హణ తేదీలపై సమాచారం లేదని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తమను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయితే కేంద్ర ఎన్నికల సంఘమే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు