అయోధ్య కోసం మోదీ చేసిందేమీ లేదు

19 Nov, 2019 11:19 IST|Sakshi
మాట్లాడుతున్న పీఠాధిపతి

సాక్షి, హైదరాబాద్‌: అయోధ్య భూ సమస్య పరిష్కారానికి పధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిలు చేసింది ఏమీ లేదని, పీవీ నర్సింహారావు హయాంలోనే అయోధ్య.. శ్రీరామచంద్రునిదని స్పష్టమైందని పూరీ గోవర్ధన పీఠం పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి మహరాజ్‌ అన్నారు. ఆయన సోమవారం నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ సత్యనారాయణస్వామి, శ్రీ శారధామాత (గోల్డన్‌టెంపుల్‌)దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లా డారు.  వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రామమందిరం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయినందుకు హిందువులంతా సంతోషించాలన్నారు. దేశంలో ఆదిశంకరులు స్థాపించిన నాలుగు జగద్గురు పీఠాలు మాత్రమే ధర్మ నిష్టతో అనాదిగా అవిచ్ఛిన్న పరంపరతో ధార్మిక దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. 

మరిన్ని వార్తలు