చెవి కొరికిన కోతి

15 Jun, 2015 22:53 IST|Sakshi
చెవి కొరికిన కోతి

నల్లగొండ: అసలే కోతి.. మరి దాన్ని.. ఉసిగొల్పితే ఊరుకుంటుందా.. మీద పడి రక్కేస్తుంది.. అచ్చం అలాంటి సంఘటనే నల్లగొండ జిల్లాలో జరిగింది. గుంపుగా వెళ్తున్న కోతులను ఓ ఆకతాయి కుర్రాడు.. రాయితో కొట్టాడు.. అది మాత్రం ఊరుకుంటుందా.. అమాంతం అతని పై దాడి చేసి అతని చెవి కొరికింది. ఈ ఘటన జిల్లాలోని ఆత్మకూరు మండలం కూరెళ్ల గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది.

గ్రామానికి చెందిన కప్పల సోమయ్య ఇంటి నుంచి బయటకు వస్తుండగా రోడ్డుపై కోతుల గుంపు వెళుతోంది. గుంపుగా వెళ్తున్న కోతులుపై సోమయ్య రాయి విసిరాడు.. అంతె ఒక్కసారిగా గుంపులోనుంచి ఒక కోతి దూసుకువచ్చి సోమయ్య ఎడమచెవి కొరికింది. అప్రమత్తమైన సోమయ్య కాళ్లకు పనిచెప్పడంతో పెను ప్రమాదం తప్పింది.
 

>
మరిన్ని వార్తలు