కేరళలో రుతుపవనాల విస్తరణ

10 Jun, 2019 02:45 IST|Sakshi

నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ అరేబియా సముద్రం, లక్ష దీవులు, కేరళ ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

అయితే ఆదివారంలో పలుచోట్ల సూర్యుడు మండిపోయాడు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, హన్మకొండ, ఖమ్మం, రామగుండంలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. నిజామాబాద్‌లో 42, నల్లగొండలో 41, మెదక్‌లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు కాగా, మహబూబ్‌నగర్‌లో మాత్రం అత్యంత తక్కువగా 37 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39 డిగ్రీలు రికార్డయింది.  

మరిన్ని వార్తలు