కక్కుర్తికి నిలయంగా కల్వకుర్తి: నాగం

14 Jul, 2016 15:09 IST|Sakshi
కక్కుర్తికి నిలయంగా కల్వకుర్తి: నాగం

హైదరాబాద్: తన కుటుంబ సభ్యులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతోందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల వ్యయం పెంపులో కేసీఆర్ ప్రమేయం లేకుంటే నంబర్ 146 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

జలయజ్ఞంలో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తమ పార్టీ సహించబోదని హెచ్చరించారు. రిటైర్డు ఇంజినీరింగ్ అధికారులను పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుర్తి కక్కుర్తికి నిలయమైందని చెప్పారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని అన్నారు.

>
మరిన్ని వార్తలు